ఆర్‌జేసీలను కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌జేసీలను కొనసాగించాలి

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

● ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్‌

నార్నూర్‌: ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌ బాలుర, ఉట్నూర్‌ బాలికల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలను (ఆర్‌జేసీ) కొనసాగించాలని ఆదివాసీ వి ద్యార్థి సంఘం (ఏఎస్‌యూ) జిల్లా అధ్యక్షుడు పెందోర్‌ సంతోష్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఆర్‌జేసీ కళాశాలలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఈవో)గా మార్చి కొనసాగిస్తామని ప్రభుత్వం భావిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌జేసీలను య థావిధిగా కొనసాగించాలని కోరారు. అవసరమైతే ప్రత్యేకంగా కొత్త సీఈవో కళాశాలలను మంజూరు చేసి భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సలహాదారుడు పెందోర్‌ దీపక్‌, డీఏసీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్‌ సుమేష్‌, రాజ్‌గొండ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు కుంరం చతుర్‌షావ్‌, మండల అధ్యక్షుడు ఆత్రం ప్రమేశ్వర్‌, నాయకులు మారప గంగారం, కొట్నాక్‌ శ్యాంరావు, కొట్నాక్‌ శ్రీరామ్‌, నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement