నిర్మల్‌ఖిల్లా: హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్నేహ మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా చిన్నారులు ప్రతిభ కనబర్చారు. కడెం మండలం కల్లెడ గ్రామానికి చెందిన స్నేహ సంఘం సభ్యురాలు దీటి శ్రీనిజ (8వ తరగతి) డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించి పేదరికంపై అద్భుతంగా ప్రసంగించి అందరి ప్రశంసలు పొందింది. సారంగాపూర్ మండలకేంద్రానికి చెందిన హాసిని ఎంపీగా వ్యవహరించి తన ప్రతిభ చాటుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, అధికారుల సమక్షంలో మాక్ పార్లమెంట్ గురువారం సాయంత్రం నిర్వహించగా ఇందులో పాల్గొన్నారు. వీరిని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. చిన్నారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతనెల 30న నిర్మల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్‌లో ఈ చిన్నారులు ప్రతిభ కనబర్చగా కలెక్టర్ భవేశ్‌మిశ్రా అభినందించారు.


