ఆదిలాబాద్(బేల): మండలంలోని పొన్నాల గ్రా మంలో ఆవుకు సోకిన హార్న్ క్యాన్సర్ (కొమ్ము క్యా న్సర్)ను పశువైద్యులు శుక్రవారం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించారు. రైతు అశోక్ పుల్మ రేకు చెందిన ఆవు కొమ్ము భాగంలో క్యాన్సర్ గడ్డలతో తీవ్ర ఇబ్బంది పడుతుండగా, పశువైద్యులు స కాలంలో స్పందించి ప్రాణదానం చేశారు. పశువైద్యాధికారి వినోద్ దేశ్‌పాండే.. శస్త్రచికిత్స చేశారు. కొమ్ము భాగాన్ని శాసీ్త్రయ పద్ధతిలో తొలగించారు. రక్తస్రావం కాకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. శస్త్రచికిత్స అనంతరం ఆవు ఆ రోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. గాయం మానడానికి అవసరమైన చికి త్స అందిస్తున్నామని, కొన్నిరోజుల అనంతరం ఆ వు పూర్తిగా కోలుకుంటుందని పేర్కొన్నారు. పశువైద్యుల బృందాన్ని స్థానిక రైతులు అభినందించారు.


