ఆదిలాబాద్‌రూరల్: నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ సెంటర్‌లో జిల్లాలోని విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్న ఏఐ, లై ఫ్ స్కిల్ శిక్షణ గురువారం ముగిసింది. విద్యార్థులకు పీపీటీ తయారు చేసి ప్రజెంటేషన్ చేశారు. అగ్రికల్చర్‌లో అభివృద్ధి, పోటీ పరీక్షలపై అవగాహన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేశారు. డీబీసీడీవో సోనియా, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఫ్యాకల్టీ మహేందర్‌రావు, శశాంక్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.


