సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో తొలకరి వర్షాలు కురవడంతో రైతులు దుక్కిలో విత్తనాలు వేసే పనుల్లో ఉన్నారు. వానాకాలం మొదలైన నుంచి ఇప్పటివరకు భారీ వర్షాలు కురవలేదు. వాతావరణంలో తే మ తగ్గలేదు. ఉష్ణోగ్రతలు వేసవి స్థాయిలోనే ఉన్నా యి. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిడుగు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
కారుమబ్బులు కమ్ముకుని భారీ శబ్దాలతో కూడిన ఉరుములు.. కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు వస్తున్నాయంటే పిడుగులు పడతాయని గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఈ హృదయ విదారక ఘటన గతేడాది జూన్ 12న చోటుచేసుకుంది. గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో దుక్కిలో విత్తనాలు వేస్తుండగా పిడుగు పడడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో పది మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృత్యువాత పడ్డ నలుగురిలో ఇద్దరు తండ్రి కూతురు కాగా, మిగతా ఇద్దరు వారి సంబంధీకులే. అదేరోజు బేల మండలం సాంగిడి, సోన్‌కాస్ గ్రామాల్లో పిడుగుపాటుకు గురై మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఆ సమయంలోనే ఉట్నూర్ మండలం కుమ్మరితండాలో పిడుగు పడడంతో ముగ్గురు గాయపడ్డారు.


