‘డబుల్‌’ పనులు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ పనులు త్వరగా పూర్తి చేయాలి

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

● కలెక్టర్‌ రాజర్షి షా ● క్షేత్ర స్థాయిలో ఇళ్ల పరిశీలన ● కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష

కైలాస్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని కేఆర్‌కే కాలనీ, మావల మండల కేంద్రం సర్వే నంబర్‌ 170లో లబ్ధిదారులకు కేటాయింపునకు సిద్ధమైన డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. గురువారం మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ అధికారులతో క్షేత్రస్థాయిలో ఇళ్లను పరిశీలించారు. వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌, తాగునీరు, శానిటేషన్‌ పనులు పరిశీలించారు. అనంతరం పట్టణంలోని గాంధీ పార్క్‌ను సందర్శించారు. పార్క్‌లో చేపట్టిన ఏడు ఫామ్‌ పాండ్స్‌, ఐదు బోర్‌ వెల్‌ రీచార్జ్‌ స్టక్చ్రర్స్‌ నిర్మాణ పనులు పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, మెప్మా పీడీ సీవీఎన్‌ రాజు, హౌసింగ్‌ పీడీ శంకర్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బీ డీఈ ప్రవీణ్‌కుమార్‌ తదితరులున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వద్దు

పథకాల అమలు, భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్‌ రాజర్షి షా హెచ్చరించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి మా ట్లాడారు. పెండింగ్‌ ఫైళ్లను గడువులోపు క్లియర్‌ చే యాలని ఆదేశించారు. ‘భూ భారతి’, సాదాబైనా మాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రెవె న్యూ, అటవీ శాఖల భూ సరిహద్దు వివాదాలను సమన్వయంతో పరిష్కరించుకోవాలని తెలిపారు. వివాదాస్పద భూముల్లో జాయింట్‌ సర్వే నిర్వహించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పే ర్కొన్నారు. కమ్యూనిటీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేయవద్దని సూచించారు. అదనపు కలెక్టర్‌ (రెవె న్యూ) ఆర్‌ఎస్‌ చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ఉట్నూర్‌ ఆర్డీవో మోహన్‌ సింగ్‌, కలెక్టరేట్‌ ఏవో వర్ణ, సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement