బోథ్: గిరిజన గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండలంలో ని కంటేగావ్ గ్రామంలో రూ.15లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడ తూ.. గ్రామస్తుల సహకారంతో పెండింగ్ సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. గ్రామానికి చెందిన రాథోడ్ ఇందల్ మాతృమూర్తి ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి గురై ఇళ్లు కో ల్పోయిన జాదవ్ దేవిదాస్, హీరాలాల్ కుటుంబా లను కలిసి ఓదార్చారు. అండగా ఉంటామని భరో సా ఇచ్చారు. మండలంలోని మర్లపల్లి గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించి నందుకు గ్రామస్తులు సర్పంచ్ శీలాబాయి అంబాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బోథ్‌లో పర్యటించిన ఎమ్మెల్యే పట్టణంలోని ప్రధాన రహదారిపై మురుగునీరు ఉండడంతో వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులున్నారు.


