ఆదిలాబాద్‌టౌన్: ప్రీప్రైమరీ స్కూళ్లను వెంటనే ర ద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వా డీ టీచర్లు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి, అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత మాట్లాడా రు. ప్రభుత్వం ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పీఎంశ్రీ ప్రీప్రైమరీ స్కూళ్లను రద్దు చేసి వీటికి కేటాయించే నిధులను అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవ్వాలని కోరారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సంఘం నాయకురాళ్లు సునీత, పార్వతి, కళావతి, రాధ, శోభ, విజయ, రత్నలక్ష్మి, నజీమ, కళ్యాణి తదితరులున్నారు.


