ఇంద్రవెల్లి: వానాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని డీపీవో రమేశ్ సూచించారు. గురువా రం మండలంలోని దనోరా(బి) గ్రామపంచా యతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, డంపింగ్ యార్డు, విద్యుత్, తాగునీటి సరఫరా తది తర వివరాలు తెలుసుకున్నారు. రికార్డులు పరి శీలించారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలని సూచించారు. సర్పంచ్ జాదవ్ జమునానాయక్, ఉప సర్పంచ్ షేక్ కరీంలాలా, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తదితరులున్నారు.


