ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్వాడి ధర్మశాల శ్రీవేంకటేశ్వర ఆలయంలో బీజే పీ నాయకులతో కలిసి పూజలో పాల్గొన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారని తెలిపారు. సుదీర్ఘకాలం పనిచేసిన ప్ర ధానులలో ఒకరిగా నిలిచి దేశానికి గర్వకారణంగా మారారని కొనియాడారు. పుష్కరకాలంలో పేదలు, రైతులు, మహిళల సంక్షేమం కోసం జనధన్, ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


