దేశ చరిత్రలో ప్రధాని మోదీ రికార్డు | - | Sakshi
Sakshi News home page

దేశ చరిత్రలో ప్రధాని మోదీ రికార్డు

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

● ఎంపీ గోడం నగేశ్‌

తలమడుగు: ప్రధాని నరేంద్రమోదీ దేశ చరిత్రలో అత్యధికంగా 4,399 రోజుల పాలన సాగిస్తూ రికార్డు సృష్టించారని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. మండలంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు దేశాన్ని అత్యధిక రోజులు పాలించిన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ గౌడ్‌, నాయకులు తాటిపల్లి గంగాధర్‌ రాజు, చంద్రకాంత్‌, ప్రభాకర్‌, వామన్‌ పటేల్‌, జీవీరమణ, వెంకటస్వామి, కిరణ్‌, నారాయణ, ప్రేమేందర్‌ రెడ్డి, స్వామి, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement