20న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

20న జాతీయ లోక్‌ అదాలత్‌

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

బోథ్‌: ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని బోథ్‌ కోర్టు న్యాయమూర్తి కె. సందీప్‌ తెలిపారు. న్యా యస్థాన ప్రాంగణంలో న్యాయవాదులతో ఆ యన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుదీ ర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సివిల్‌, క్రిమినల్‌ కేసులను ఎక్కువ మొత్తంలో పరిష్కరించేలా న్యాయవాదులు చొరవ చూపాలన్నారు. ఈమేరకు కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్‌ అదాలత్‌ ద్వారా సమ యం, డబ్బు ఆదా అవుతాయని, ఇరువర్గాల కు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ పంద్రం శంకర్‌, బార్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ రూపేందర్‌ సింగ్‌, న్యాయవాదులు ఆడెపు హరీశ్‌, మహేశ్‌, గంగసాగర్‌, సందేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement