ఆదిలాబాద్‌టౌన్: ఖైదీల్లో సానుకూల మార్పునకు యోగా దోహద పడుతుందని జిల్లా జైలు సూపరింటెండెంట్ పి.గోపిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకు ని జిల్లా జైలులో బుధవారం నుంచి యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు. 200 మంది ఖైదీలు, 45 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నట్లు తెలిపారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకా గ్రత పెంపొందుతుందని అన్నారు. ఈ శిక్షణ ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో జైలర్ ఎన్.చంద్రశేఖర్, సిబ్బంది, తతోవంశి యోగా గురువు విజయ్ కుమార్ పాల్గొన్నారు.


