జిల్లాలో పర్యటించిన శిక్షణ ఐఏఎస్‌లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో పర్యటించిన శిక్షణ ఐఏఎస్‌లు

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

ఇంద్రవెల్లి: 2025 బ్యాచ్‌కు చెందిన శిక్షణ ఐఏఎస్‌లు బుధవారం జిల్లాలో పర్యటించారు. తెలంగాణ దర్శన్‌లో భాగంగా ట్రైయినీ ఐఏఎస్‌లు హరిప్రసా ద్‌, సాయి సురేశ్‌, సాయి శివాని, శ్రీకాంత్‌రెడ్డి, సచి న్‌ భజవరగుట్టు, పసర్‌కుమార్‌ ముందుగా కేస్లాపూర్‌ చేరుకున్నారు. నాగోబా ఆలయంలో పూజలు చేపట్టారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూ పాన్ని సందర్శించి అమరులకు నివాళులర్పించారు. ఇందులో ఐటీడీఏ ఏపీవో వసంత్‌రావ్‌, డిప్యూటి ఈవో చందన్‌, ఏపీవో పీవీటీసీ భాస్కర్‌, డీఈ తా నాజీ, ఎస్‌వో రాజ్‌కుమార్‌, జేడీఎం నాగభూషణ, నాగ్‌నాథ్‌ తదితరులున్నారు.

‘ఐటీడీఏ’లో అధికారులతో సమీక్ష

ఉట్నూర్‌రూరల్‌: మండలంలోని కామాయిపేట గ్రా మాన్ని సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోని పీవో చాంబర్లో వివిధ శాఖ ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement