పెట్రో ధరలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెట్రో ధరలు తగ్గించాలి

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

● కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ ధర్నా

కై లాస్‌నగర్‌: పెంచిన పెట్రో, వంటగ్యాస్‌ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బుధవారం కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెంచుతూ సా మాన్యుడి నడ్డి విరుస్తోందని ఆరోపించారు. ఫలితంగా పెరిగిన నిత్యావరాల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగి న గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, అర్ధాంగి రమేశ్‌, అమీనా బేగం, మహబూబ్‌ ఖాన్‌, సలీం,షేక్‌ పాషా, కట్గోజి స్వామి, ఎస్‌.అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement