ఆదిలాబాద్‌టౌన్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉ న్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు ఈనెల 20న జాతీయ లోక్ అ దాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ప్రభాకరరా వు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ క్రిమినల్ కేసులు, సివిల్, రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కేసులను రాజీమార్గం ద్వారా శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ మంచి అవకాశమని తెలిపారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


