సాక్షి,ఆదిలాబాద్/ఆదిలాబాద్‌టౌన్: జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పోలీస్‌బాస్ మంగళవారం రాత్రి ఆదిలాబాద్‌కు విచ్చేశారు. డీజీపీ సీవీ ఆనంద్‌కు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. వారివెంట ఉమె న్ సేఫ్టీ, సీఐడీ డీజీ చారుసిన్హా తదితరులున్నారు. వీరు బుధవారం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.
బెల్లంపల్లిలో ఏడాదిపాటు అదనపు ఎస్పీగా..
డీజీపీ సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో ఆపరేషన్స్ అ దనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడిషనల్ ఎస్పీ)గా ఏడాది పాటు పనిచేశారు. నక్సలైట్లపై కూంబింగ్ ఆపరేషన్లకు స్వయంగా నాయకత్వం వహించారు. డీజీపీగా మే 1న బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు.
నేటి పర్యటన ఇలా..
డీజీపీ ఉదయం జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూలో పాల్గొననున్నారు. పట్టణంలోని కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వ్య వస్థను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చేరుకుంటా రు. వీటితో పాటు పలు ఇతర కార్యక్రమాల్లోనూ డీజీపీ పాల్గొననున్నారు.


