ఓటర్ల మ్యాపింగ్‌ విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల మ్యాపింగ్‌ విజయవంతం చేయండి

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: ఓటర్ల మ్యాపింగ్‌ను విజయవంతం చే యాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో తన ఓటును ఎస్‌ఐఆర్‌– 2002 జాబితాకు బీఎల్‌వో, తహసీల్దార్‌ సమక్షంలో మంగళవారం మ్యాపింగ్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మ్యాపింగ్‌ ప్రక్రియకు జూన్‌ 24 వరకు గడువు ఉందన్నారు. 25వ తేదీ నుంచి బీ ఎల్‌వోలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్‌ ఫార మ్స్‌ ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. పట్టణ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ యజ్వేందర్‌ రెడ్డి, బీఎల్‌వో నివేదిత తదితరులున్నారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రగతిపై సమీక్ష

జిల్లా కేంద్ర సహకార బ్యాంకును లాభాలబాటలో తీసుకెళ్లెలా పనిచేయాలని కలెక్టర్‌, బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి రాజర్షి షా ఆదేశించారు. మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు సంబంధించిన డీఎల్‌ఎంఆర్‌సీ, డీఎల్‌ఈసీ సమావేశాలు నిర్వహించారు. బ్యాంకు ప్ర స్తుత ఆర్థిక స్థితిగతులు, ప్రగతిని సమీక్షించారు. ఖా తాదారులకు మెరుగైన సేవలు అందించేలా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశంలో సీఈవో సీహెచ్‌.రవి, నాబార్డ్‌ డీడీఎం అబ్దుల్‌ రవూఫ్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల సహకార అధికారి ఎం.సత్యనారాయణ, మంచిర్యాల అసిస్టెంట్‌ రిజి స్ట్రార్‌ రవీందర్‌, డీజీఎంలు టి. వెంకటేశ్వరస్వామి, జి.భీమేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

పీఆర్‌ కార్యాలయం తనిఖీ

జెడ్పీ కార్యాలయంలో గల పంచాయతీరాజ్‌ ఈఈ కార్యాలయాన్ని కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేశా రు. అన్ని విభాగాల గదులు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. విలేజ్‌ ఆర్గనైజేషన్‌ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జీపీ భవనాలతో పాటు పాఠశాలల్లో చేపట్టిన కిచెన్‌ షెడ్లు, మరుగుదొడ్లు, కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మాణ పనులను గడువులోపు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం క్వాలిటీ కంట్రోల్‌ విభాగాన్ని సందర్శించారు. పనుల నాణ్యత పర్యవేక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట ఈఈ శివరాం, డీఈఈ రమేశ్‌పవార్‌, క్వాలిటీ కంట్రోల్‌ డీఈఈ సలావుద్దీ న్‌, సూపరింటెండెంట్‌ శ్రీరామ్‌ తదితరులున్నారు.

విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు

ఆదిలాబాద్‌టౌన్‌:విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నా రు. జెడ్పీ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ, గతేడాదితో పోల్చితే ఈసారి 30 శాతం విద్యార్థుల ఎన్‌రోల్మెంట్‌ పెంచాలని ఆదేశించారు. లేకుంటే ఉపాధ్యాయులపై చర్యలుంటా యని హెచ్చరించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు రావాలని సూచించారు. యూని ఫాంకు సంబంధించిన వస్త్రం వస్తుందని, మెప్మా అధికారులు చొరవ చూపి త్వరగా కుట్టించేలా చూ డాలన్నారు. ఇప్పటినుంచే పదో తరగతి విద్యార్థుల పై ప్రత్యేక దృష్టిసారించాలని పేర్కొన్నారు. ప్రతీ పాఠశాలలో కిచెన్‌ గార్డెన్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. డిజిటల్‌ విద్య పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న 12 జీరో ఎన్‌రోల్మెంట్‌ పాఠశాలలను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలని విద్యా శాఖాధికారులను ఆదేశించారు. 22 అంశాల ను తప్పనిసరిగాఅమలు చేయాలన్నారు. సమావేశంలో డీఈవో మాధవి, పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ కందుల గజేందర్‌, తిరుపతి, లక్ష్మణ్‌, రఘురమణ, అజయ్‌, ఎంఈవో సోమయ్య, మెప్మా పీడీ సీవీఎన్‌ రాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement