కై లాస్‌నగర్: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం కొత్తగా బస్సులను అందజేసింది. ఎస్‌హెచ్‌జీ సభ్యులను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 18 సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఒక్కో సంఘానికి ఒకటి చొప్పున 18 బస్సులను కేటాయించింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన మహిళా శక్తి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎస్‌హెచ్‌జీలకు వాటిని అందజేశారు. కార్యక్రమానికి జిల్లా నుంచి డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఏపీడీ జాదవ్ గోవింద్‌రావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పి.లక్ష్మి, కోశాధికారి మంజూషా, సెర్ప్ హెచ్‌ఆర్ మేనేజర్ శ్రీనివాస్‌తో పాటు అన్ని మండలాల ఏపీఎంలు, ఒక్కో మండలం నుంచి 50 మంది మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఈ బస్సులను మండల సమాఖ్యలు ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.69వేల చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లించనుంది. ఎస్‌హెచ్‌జీల ఆర్థిక స్వావలంబనకు ఈ పథకం తోడ్పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.


