ఆదిలాబాద్‌టౌన్: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)గా డాక్టర్ సాధన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఉట్నూర్‌లో అడిషనల్ డీఎంహెచ్‌వోగా కొనసాగారు. ఇక్కడ డీఎంహెచ్‌వోగా పనిచేస్తూ డిప్యూటేషన్‌పై ఉన్న కృష్ణ బదిలీపై నాగర్‌కర్నూల్‌కు వెళ్లారు. కేవలం రెండు నెలల పాటు మాత్రమే ఆయన ఇక్కడ విధులు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో డిప్యూటేషన్‌పై పనిచేశారు. కాగా ఇదివరకు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా పనిచేసిన నరేందర్ 2020 జూన్ నుంచి ఇప్పటివరకు విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈయన పీఓడీటీటీగా కొనసాగనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఎంహెచ్‌వోను ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్, డిప్యూటీ సివిల్ సర్జన్ మనోహర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, కార్యాలయ ఏఓ నందిని, డీపీఓ దేవిదాస్, తెలంగాణ వైద్యారోగ్య శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బ్రహ్మానంద రెడ్డి, రమణాచారి, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.


