చికిత్స పొందుతూ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ మృతి

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

రెబ్బెన: మండలంలోని నేర్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రేగళ్ల వెంకటేశ్వర్లు (45) చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెల 11 నుంచి వెంకటేశ్వర్లు నేర్పల్లిలో జనగణన విధులు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబీకులు చికిత్స చేయించినా కోలుకోలేదు. సోమవారం పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ కార్డియక్‌ అరెస్ట్‌కు గురై సోమవారం రాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య శ్రీలత ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement