ఏపీఐ రాష్ట్ర చైర్మన్‌గా రాములు | - | Sakshi
Sakshi News home page

ఏపీఐ రాష్ట్ర చైర్మన్‌గా రాములు

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

నిర్మల్‌ఖిల్లా: అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియ న్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏ పీఐ) రాష్ట్ర చైర్మన్‌గా నిర్మల్‌కు చెందిన ప్ర ముఖ వైద్యుడు డాక్టర్‌ దామెర రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈమేర కు ప్రకటించినట్లు ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ నవల్‌చంద్ర తెలిపారు. నాలుగు దశాబ్దాలకుపైగా వైద్యవృత్తిలో సేవలందిస్తున్న ఆయన ఉమ్మడి జిల్లా నుంచి తొలి ఏపీఐ రాష్ట్ర చైర్మన్‌గా ఎంపికయ్యారు. అసోసియేష న్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతానని దామెర రాములు తెలిపారు. ఈయన వైద్యవృత్తితోపాటు సాహితీరంగంలో తనదైన శైలిలో ప్రజలను జాగృతం చేస్తుండటం విశేషం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement