బొమ్మను గీస్తే.. | - | Sakshi
Sakshi News home page

బొమ్మను గీస్తే..

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

చిత్రకళపై విద్యార్థులకు ఆసక్తి

శిక్షణలో నైపుణ్యం నేర్చుకుంటూ..

బొమ్మ గీయడంలో తర్ఫీదు ఇస్తున్న కోచ్‌

నిర్మల్‌టౌన్‌: పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వేసవి సెలవులను సద్వి నియోగం చేసుకుంటున్నారు. పేప ర్‌, కాన్వాస్‌పై బొమ్మలు గీయడం, రంగులు అద్దడం, భావాలు, ఆలో చింపజేసే చిత్రకళపై ఆ సక్తి పెంచుకుంటున్నారు. ఇందుకోసం పెయింటింగ్స్‌ శిక్షణలో చేరి కళాప్రతిభకు పదును పెడుతున్నా రు. చిత్రలేఖనం, స్కెచ్చింగ్‌, వాటర్‌ కలర్‌, అక్రిలిక్‌ పెయింటింగ్‌ వంటి విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. పెన్సిళ్లు, సిరా, వాటర్‌ కలర్స్‌, ఇతర వాటితో జాతీయ నాయకులు, ప్రకృతి అందాలు, జంతువులు, పక్షులు, సామాజిక అంశాలపై చిత్రాలు గీస్తూ ఆకట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలు గుర్తించి ప్రోత్సహిస్తున్నా రు. దీంతో శిక్షణా కేంద్రాలకు ఆదరణ పెరుగుతోంది.

ఏకాగ్రత ఉండాలి

చిత్రలేఖనం అంటే రంగులతో పూర్తయ్యే పని కాదు. బొమ్మ గీయాలంటే ఎంతో ఏకాగ్రత ఉండాలి. మనసులోని భావాలను కాగితంపై బొమ్మగా మార్చేందుకు ఆలోచించాలి. నిదానం పాటించాలి. అప్పుడే బొమ్మ అందంగా వస్తుంది. అప్పుడే ఊహాశక్తిని అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆకారాలు, రంగులు, దశ్యాలను గుర్తుంచుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement