సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

ఆదిలాబాద్‌రూరల్‌: ఆదివాసీ పర్ధాన్‌ సమాజ్‌ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలని మహా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఓఎస్డీ, ఆదివాసీ పర్ధాన్‌ సమాజ్‌ నేత హామ్‌రాజ్‌ ఉయికే, సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్‌ జొగ్‌దండా అన్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 28న నిర్వహించే ఆదివాసీ పర్ధాన్‌ సమాజ్‌ సభ నిర్వహణపై శనివారం ఓ హోటల్‌ నిర్వహించిన సన్నాహాక సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. పర్ధాన్‌ సమాజ్‌ తెగకు ప్రభుత్వాలు పథకాలు అందించాలని పేర్కొన్నారు. రాజకీయంగా, ఉద్యోగ, ఉపాధి, వైద్య, విద్యరంగాల్లో అవకాశాలు కల్పించాలన్నారు. మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అశోక్‌ ఉయికే రాష్ట్రాలవారీగా సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీలు, సంఘాలకతీతంగా నిర్వహించే సభకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రాల్లో సభలు ముగిశాక ఢిల్లీలో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో ఆదివాసీ పర్ధాన్‌ సమాజ్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement