● ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ ముమ్మరం ● జిల్లాలో ఇప్పటికే 72 శాతం పూర్తి ● 15నుంచి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ● ఓటరు జాబితా ప్రక్షాళనకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

● ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ ముమ్మరం ● జిల్లాలో ఇప్పటికే 72 శాతం పూర్తి ● 15నుంచి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ● ఓటరు జాబితా ప్రక్షాళనకు శ్రీకారం

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

● ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ ముమ్మరం ● జిల్లాలో ఇప్పటికే 72 శాతం పూర్తి ● 15నుంచి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ● ఓటరు జాబితా ప్రక్షాళనకు శ్రీకారం

కై లాస్‌నగర్‌: బోగస్‌ ఓటర్లకు చెక్‌ పెట్టడంతో పాటు ఒకరికి ఒకేచోట ఓటు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళనకు శ్రీకా రం చుట్టింది. అనర్హులను తొలగించి అర్హులతో కూ డిన కొత్త జాబితా రూపొందించేలా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)కు సిద్ధమైంది. 2002లో జరిగిన సమగ్ర సర్వే ఓటరు జాబి తాను ప్రామాణికంగా తీసుకుని ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టనుంది. జిల్లాలో బీఎల్వోలు ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి పాత జాబితా ప్రకారం ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు.

72శాతం మ్యాపింగ్‌ పూర్తి

జిల్లాలో ఇప్పటివరకు 72శాతం మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తయింది. కాగా, ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తిచేసే దిశగా బీ ఎల్వోలు ప్రక్రియ ను ముమ్మరం చేశారు. జిల్లాలో 4,67,695 మంది ఓట ర్లుండగా ఇప్పటివరకు 3,43,334 మంది ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 2,52,455 మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 1,57,616 మంది మ్యాపింగ్‌ పూర్తి కాగా ప్రక్రియ 62శాతం నమోదైంది. బోథ్‌ నియోజకవర్గంలో 2,26,340మంది ఓటర్లుండగా ఇందులో 1,85,718 మంది ఓటర్లను మ్యాపింగ్‌ చేశా రు. ఇక్కడ అత్యధికంగా 85శాతం ప్రక్షాళన పూర్తయింది. బీఎల్వోలు తమ పరిధిలోని గ్రామాలు, వార్డుల్లోని ఇంటింటికీ వెళ్లి 1.01. 2002న జరిగిన సమగ్ర సర్వే ఓటరు జాబితా (ఎస్‌ఐఆర్‌)లో ఉన్న ఓటర్లను ప్రస్తుత జాబితా లో సరిపోల్చుతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజిన్‌ (సర్‌) ప్రక్రియలో భాగంగా మృతుల కుటుంబాలకు, వలస వెళ్లిన వారికి, డబుల్‌ ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. అనంతరం ఓటరు జాబితా నుంచి వారి పేర్లు శాశ్వతంగా తొలగించనున్నారు.

జిల్లాలోని ఓటర్ల సమాచారం

జిల్లాలోని ఓటర్లు 4,67,695

ఇప్పటివరకు మ్యాపింగ్‌ 3,43,334

ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఓటర్లు 2,52,455

ఇప్పటివరకు మ్యాపింగ్‌ 1,57,616

బోథ్‌ నియోజకవర్గ ఓటర్లు 2,26,340

ఇప్పటివరకు మ్యాపింగ్‌ 1,85,718

పారదర్శకంగా నిర్వహిస్తాం

ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియను జిల్లాలో పారదర్శకంగా నిర్వహిస్తాం. 2002నాటి ఓటరు జాబితా ప్రామాణికంగా జాబితా ప్రక్షాళన జరుగుతుంది. ఒకవేళ 2002నాటి ఓటర్ల జాబితా అందుబాటులో లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటర్ల సౌకర్యార్థం ఆ పాత జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం, సీఈవో తెలంగాణ అధికారిక వెబ్‌సైట్లలో తమ వివరాలు సులభంగా వెతుక్కునే సదుపాయం కల్పిస్తున్నారు. పారదర్శక జాబితా తయారీకి రాజకీయ పార్టీలు, అధికారులు సహకరించాలి. – రాజర్షి షా, కలెక్టర్‌

15 నుంచి ప్రక్రియ షురూ

సర్‌ ప్రక్రియ ఈ నెల 15నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఈ నెల 15నుంచి 24వరకు వరకు ఓటర్ల జాబితా తయారీ, సిబ్బందికి శిక్షణ, జాబితా ముద్రణ లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. జూన్‌ 25నుంచి జూలై 24వరకు బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వే చేపట్టనున్నారు. ఇదే సమయంలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. దీనిపై జూలై 31నుంచి ఆగస్టు 30వరకు అభ్యంతరాలు, క్లెయింలు స్వీకరించనున్నారు. ఇలా అందిన దరఖాస్తులను సెప్టెంబర్‌ 28లోపు పరిష్కరించి, అక్టోబర్‌ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ నిర్వహణపై కలెక్టర్‌ రాజర్షి షా బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. పార్టీల తరఫున బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement