కై లాస్‌నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో పట్ట ణాల్లోని ప్రతీ వార్డు సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం పట్టణంలోని 45వ వార్డు భుక్తాపూర్ కాలనీలో నిర్వహించిన వార్డు సభకు మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. వార్డులో నెలకొన్న డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, పారిశుద్ధ్య సమస్యలు త్వరగా గుర్తించి పరిష్కారానికి తగిన ప్రణాళికలతో నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మున్సిల్ చైర్ పర్సన్ అనూష మాట్లాడు తూ.. అభివృద్ధి పనుల్లో స్థానికులు భాగస్వాములైతేనే వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం సా ధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం వేసవి శిక్షణ శిబిరం స్విమ్మింగ్ పోటీల్లో రెండో బహుమతి పొందిన మున్సిపల్ చైర్ పర్సన్ దంపతుల కుమార్తె బండారి అమితకు కలెక్టర్ ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, డీఈవో మాధవి, వార్డు ప్రత్యేకాధికారి నిహారిక, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన బోధన అందించాలి
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులందరికీ నాణ్యమైన, గుణాత్మకమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎఫ్‌ఎల్‌ఎన్ ఇన్‌స్పెక్షన్ టీమ్ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానం, తరగతి గదుల్లో బోధన, అభ్యసన సామగ్రి (టీఎల్‌ఎం) వినియోగం, విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ఆరా తీశారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలు, రాత నైపుణ్యాలను పరిశీలించి, వారి విద్యా పురోగతి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం అమలవుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం, టీఎల్‌ఎం విధానం తదితర అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థుల్లో పఠనం, రచన, గణిత నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు పలు కీలక సూచనలు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, డీఈవో మాధవి, అకాడమిక్ మానిటరింగ్ అధికారులు లక్ష్మణ్, అజయ్, సీఎంవో తిరుపతి, విద్యా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


