ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఎయిర్ ఫీల్డ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎ మ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ మహంతిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణకు సంబంధించిన అంగీకార పత్రాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది జిల్లా రూపురేఖలను మార్చే అ తిపెద్ద ప్రాజెక్ట్ జాయింట్ ఎయిర్‌ఫీల్డ్ అని తెలి పారు. దీని నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు తా ము చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నట్లు పే ర్కొన్నారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన 1,580 ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ఎయిర్‌ఫీల్డ్ రాకతో భారత వా యుసేన శిక్షణ కార్యకలాపాలతో పాటు పౌర విమానయాన సేవలు కూడా మన జిల్లాకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. శంషాబాద్ స్థాయిలోనే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కానుందని, దీనికి అ నుబంధంగా ప్రభుత్వం 2వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. దీంతో పరిశ్రమలు వచ్చి, స్థానిక యువతకు భారీగా ఉద్యోగావకా శాలు లభిస్తాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల సమన్వయంతో ఆదిలాబాద్‌ను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్, సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.


