సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

ఆదిలాబాద్‌టౌన్‌: సీజనల్‌ వ్యాధులపై వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ సూచించారు. గురువారం డీఎంహెచ్‌వో చాంబర్‌ నుంచి మెడికల్‌ ఆఫీసర్లు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. వర్షాకాలంలో జిల్లాలోని 201 గ్రామాల్లో రా కపోకలు నిలిచిపోతాయని, వాటిని హైరిస్క్‌ గ్రా మాలుగా గుర్తించి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జూలైలో ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డీఎంహెచ్‌వో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సీజ నల్‌ వ్యాధుల దృష్ట్యా ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్టాప్‌ డయేరి యా కార్యక్రమాన్ని చేపట్టాలని, బాధితులకు 14 రోజులకు సరిపడా జింక్‌ మాత్రలు అందించాలని ఆదేశించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చొప్పున ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేయాలని తెలిపారు. టీబీ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చే యాలని, హైరిస్క్‌ గ్రామాల్లో ఎక్స్‌రే క్యాంపులు ఏ ర్పాటు చేయాలని పేర్కొన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులు మందులు సక్రమంగా వాడుతున్నారా? లేదా? అనే విషయాన్ని వైద్య సిబ్బంది పరిశీలించాలని సూచించారు. విధులను నిర్లక్ష్యం చేయొద్దని తెలిపా రు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ వైసీ శ్రీనివాస్‌, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్‌ సుమలత, ప్రోగ్రాం ఆఫీసర్‌ దేవిదాస్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement