‘జనగణన’ లోపాలు సవరించాలి | - | Sakshi
Sakshi News home page

‘జనగణన’ లోపాలు సవరించాలి

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: జనగణన హెచ్‌ఎల్‌వో డేటాలోని లో పాల సవరణతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల సామూహి క గృహప్రవేశాల పనులు ప్రాధాన్యతతో పూర్తి చే యాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా, మండల, మున్సిపల్‌ అధికారులతో గూగుల్‌ మీట్‌ ద్వారా ఆదివారం సమీక్షించారు. జన గణన హెచ్‌ఎల్‌వో డేటాలో ఉన్న అన్ని రకాల లోపాలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సరిచేయాలన్నారు. మాస్ట ర్‌ ట్రైనర్లు, సూపర్‌వైజర్లు, చార్జ్‌, వార్డు అధికారులు సమన్వయంతో వ్యవహరించి తప్పుల్లేని డేటా సి ద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి, మహా గృహప్రవేశ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలన్నారు.విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, జెడ్పీ సీఈఓ రవి, జిల్లా పంచాయతీ అధికారి రమేష్‌, హౌసింగ్‌ పీడీ శంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement