ఇంద్రవెల్లి: ప్రజా ప్రభుత్వం అన్ని మతాలకు గౌరవం ఇస్తుందని రాష్ట్ర కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మండల కేంద్రంలోని హోలీట్రినిటి చర్చిలో ఆదివారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కుల మత భేదాలు పక్కన పెట్టి మనమంతా భారతీయులం అనే భావనతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్ పీఎస్ జోసెప్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్‌జాదవ్, ఇంద్రవెల్లి ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, క్రైస్తవ పెద్దలు చందు, విజయ్‌కుమార్, మల్యాల సుందర్, బొర్రన్న పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి


