నెరవేరనున్న ‘డబుల్‌’ కల | - | Sakshi
Sakshi News home page

నెరవేరనున్న ‘డబుల్‌’ కల

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

● కసరత్తు చేస్తున్న యంత్రాంగం ● ఏ ఇల్లు ఎవరిదో తెలియని వైనం ● జూన్‌ 3తర్వాత వెల్లడయ్యే అవకాశం! ● వసతుల కల్పనకు కలెక్టర్‌ ఆదేశం

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని డబుల్‌ బె డ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు అధి కార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రెండు విడతలుగా నిర్వహించిన లక్కీ డ్రాలో 934 మంది ఎంపిక కాగా, ఏ ఇల్లు ఎవరికి కేటాయించాలనే దానిపై రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టా రు. దివ్యాంగులు, వితంతువులతో పాటు ముస్లిం మైనార్టీలకు ఏ ప్రతిపాదికన ఇంటిని కేటాయించా లనేదానిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తొలు త రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న లబ్ధిదా రులకు ఇంటి కేటాయింపు పత్రాలు అందజేస్తామని భావించినా కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది. జూన్‌ 3నాటికి డబుల్‌ బెడ్రూం ఇళ్లలో ఎవరికి ఏ ఇల్లు వచ్చిందనేదానిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో సొంతింటి కోసం గంపెడాశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల మరి కొద్దిరోజుల్లోనే సాకారమయ్యే అవకాశముంది.

మూడు విడతల్లో ఎంపిక

ఆదిలాబాద్‌ పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో రెండు బ్లాక్‌లుగా 760, మావల మండల కేంద్రంలోని జా తీయ రహదారి సమీపంలోని సర్వే నంబర్‌ 170లో 222 ఇళ్ల చొప్పున మొత్తం 982 ఇళ్లను గత ప్రభుత్వ హయాంలో అపార్ట్‌మెంట్‌ తరహాలో నిర్మించారు. వీటి కేటాయింపునకు మూడు విడతలుగా లక్కీ డ్రా నిర్వహించారు. తొలుత పట్టణంలోని 36వార్డులకు సంబంధించి 618 ఇళ్ల కేటాయింపునకు మూడేళ్ల కిందట అప్పటి కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌యార్డులో లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. వాటిపై అభ్యంతరాలు రావడంతో విచారణ చేపట్టిన మున్సిపల్‌ అధికారులు అందులో 488మందిని అర్హులుగా గుర్తించి మిగతా పేర్లు తొలగించారు. మరో 16వార్డులకు గాను 109 మందిని రెండోసారి ఎంపిక చేశారు. ఇటీవల మరో 337 ఇళ్లకు ఈ నెల 16న కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ర్యాండమైజేషన్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం 1,032 దరఖాస్తులు రాగా ఒక్కో వార్డుకు ఏడు చొప్పున లబ్ధిదారులను సెలెక్ట్‌ చేశారు. జూన్‌ 2నాటికి వీరికి ఇళ్ల కేటాయింపు పత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.

ఏ ఇల్లు ఎవరికో?

రెండు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లన్నీ అపార్ట్‌మెంట్‌ తరహాలో ఉన్నవే కావడంతో ఏ ఇంటిని ఎవరికి కేటాయించాలనేదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దివ్యాంగులకు గ్రౌండ్‌ ఫ్లో ర్‌లోనే కేటాయించాలని భావిస్తున్నారు. లబ్ధిదారుల్లో వృద్ధులు, వితంతువులు ఉంటే వారికి తదుపరి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముస్లిం మైనార్టీ లబ్ధిదా రులందరికీ ఒకేచోట ఇళ్లు కేటాయిస్తే ఎలా ఉంటుందనే దిశగా అఽధికారులు ఆలోచిస్తున్నారు. కలెక్టర్‌ రాజర్షి షా దీనిపై మున్సిపల్‌, రెవెన్యూ, హౌసింగ్‌శాఖల అధికారులతో సమావేశమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. లబ్ధిదారులను ఎంపిక చేసినట్లుగానే ఇళ్లు కూడా ర్యాండమైజేషన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా లక్కీడ్రా ప్రకారం కేటాయించే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జూన్‌ 3నాటికి ఏ ఇల్లు ఎవరికి కేటాయించారో అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

మౌలిక సౌకర్యాల కల్పనకు ఆదేశం

లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లు కేటాయించనున్నందున వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించే దిశగా అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌, సీసీ రోడ్లు లాంటి మౌలిక సౌకర్యాలు కల్పించేలా చూడాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కేఆర్‌కే కాలనీల్లోని రెండు బ్లాక్‌ల వద్ద సౌకర్యాలకు సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేకంగా భారీ సెప్టిక్‌ ట్యాంకులను నిర్మించారు. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌పార్మర్లను ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం ట్యాంకులనూ నిర్మించారు. 170 సర్వే నంబర్‌లోని ఇళ్ల వద్ద కూడా త్వరలోనే ఈ సౌకర్యాలు కల్పించే దిశగా పనులు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

జిల్లా కేంద్రంలో ‘డబుల్‌’ ఇళ్ల వివరాలు

నిర్మించిన ఇళ్లు 982

ఎంపికై న లబ్ధిదారులు 934

రిజర్వ్‌లో ఉంచిన ఇళ్లు 48

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement