సాక్షి, ఆదిలాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. టీపీసీసీ నుంచి వచ్చిన ఆ దేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించిన బీఎల్‌ఏ–2లకు ఎలా ముందుకెళ్లాలో పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా ఓ టర్ల తొలగింపుపై నిశి తంగా దృష్టి సారించాలనే ఆదేశాల నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నేతలు అలర్ట్ అయ్యా రు. ఈ ప్రక్రియ కోస మే పార్లమెంట్ ఇన్‌చారి ్జ తో పాటు ప్రతీ నియోజకవర్గానికి సంబంధించి పరిశీలకులను పార్టీ నియమించింది. ఇందులో భాగంగానే ఆదివారం జిల్లా కేంద్రానికి పార్లమెంట్ ఇన్‌చార్జి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నియోజకవర్గాల పరి శీలకులు ఓబెదుల్లా కొత్వాల్, రమేశ్ రానున్నారు.
కొనసాగుతున్న మ్యాపింగ్ ప్రక్రియ
రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కొ నసాగుతోంది. జిల్లాలోనూ ఈ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహిస్తు న్నా రు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 45శాతం, బోథ్ నియోజకవర్గంలో 84శాతం ఇప్పటికే మ్యాపింగ్ ప్ర క్రియ పూర్తయింది. ఈ ప్రక్రియ పూరయ్యాక ఎన్నిక ల సంఘం ప్రధానంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇందులోభాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రకటిస్తా రు. సేకరించిన మ్యాపింగ్ డేటా ఆధారంగా ము సాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఈ జాబి తాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, పేర్ల తొలగింపునకు, కొత్త పేర్ల చేర్పునకు వినతులు స్వీకరిస్తారు.
ప్రక్రియపై దృష్టి
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ‘సర్’ ప్రక్రియపై నిశితంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుండగా ఓటర్ల తొలగింపు పై క్షేత్రస్థాయిలో సూక్ష్మంగా పరిశీలన చేయాలని టీపీసీసీ నుంచి డీసీసీకి ఆదేశాలు వచ్చాయి. ఇ ప్పటికే బూత్ లెవెల్ ఎజెంట్లు (బీఎ ల్‌ఏ–2) ల ను నియమించి ప్రతీ పో లింగ్ బూత్‌కు సంబంధించిన ప్రక్రియను పరి శీలించనున్నారు. జిల్లాలో 780 మందిని పార్టీ బీఎల్‌ఏ–2గా నియమించింది. వారితో ఆదివారం ఉదయం 10గంటలకు జిల్లా కేంద్రంలోని చిల్కూరి లక్ష్మీగార్డెన్స్‌లో సమావేశం నిర్వహించనున్నారు.
‘సర్’ ప్రక్రియలో ఎన్నికల సంఘం నుంచి తొలగించే ఓట్లపైనే ప్రధానంగా కాంగ్రెస్ దృష్టి సారించనుంది. పశ్చిమబెంగాల్‌లో ‘సర్’ ప్రక్రియలో భాగంగా అర్హులైన అనేక మంది ఓటర్లను తొలగించారనేది ఆ పార్టీ ఆరోపణ. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో ఏజెంట్లు తొలగించే ఓటర్లకు సంబంధించి వివరాల సేకరణలో అనుక్షణం అలర్ట్‌గా ఉండాలని సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలో పార్టీ నుంచి వచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం వ్యవహరించేలా మార్గదర్శనం చేయనున్నారు.
నేడు కాంగ్రెస్ బీఎల్‌ఏల సమావేశం
కైలాస్‌నగర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (సర్) ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ బీఎల్‌ఏ–2ల సమావేశాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేశ్‌జాదవ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద యం 10గంటలకు పట్టణ శివారులోని చిల్కూరి లక్ష్మిగార్డెన్‌లో నిర్వహించనున్న సమావేశానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, నియోజకవర్గ పరిశీలకులు ఓబెదుల్లా కొత్వాల్, రమేశ్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మండలాధ్యక్షులు అధికసంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తొలగించే ఓట్లపైనే దృష్టి


