కైలాస్‌నగర్: మహిళలు సంకల్పంతో ముందుకు సాగితే అ న్ని రంగాల్లో రాణిస్తారని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శ నివారం జెడ్పీ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి, సె ర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కిశోర బాలికలు, యువతుల మాక్ పార్లమెంట్ స్నేహ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల జీవితంలో చాలా కీలకమైన సమయమని, ఈ దశలో బేసిక్స్‌పై పట్టు సాధిస్తే సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, నీట్, జేఈఈ లాంటి పోటీ పరీక్షల్లో సులువుగా విజయం సాధించవచ్చని తెలిపారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా లాంటి ఆన్‌లైన్ వేదికలను ఉచితంగా, తక్కువ ఖర్చుతో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేజీబీవీల్లో చదివు విద్యార్థినుల్లో ఖగోళ శాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు టెలిస్కోపులు, స్పేస్ తదితర ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్నేహ గ్రూప్ బాలికలు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అధికార, ప్రతిపక్ష పాత్రల్లో ఎంతో క్రమశిక్షణతో పార్లమెంట్ నిర్వహించిన విధానం, సమస్యలను ప్రస్తావించిన తీరును కలెక్టర్ అభినందించారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ సీఈవో రవి, డీడబ్ల్యూవో మిల్కా, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి తదితరులున్నారు.
అమ్మ మాట–అంగన్‌వాడీ బాట సక్సెస్ చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: అమ్మ మాట–అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని రిక్షా కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బాలల సమగ్ర అ భివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు బలమైన పునాదిగా పనిచేస్తూ ఆరోగ్యకరమైన బాల్యానికి బాటలు వేయాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ సంకల్పంలో భాగంగా సాగుతు న్న ఈ సేవల్లో లోపాలున్నా, అత్యవసర పరిస్థితులెదురైనా ప్రభుత్వ ఉచిత చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098ను సంప్రదించాలని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో ని చిన్నారులకు యూనిఫారంలు, విద్యా ఆరంభ సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి మి ల్కా, వార్డు కౌన్సిలర్ స్వాతి మంగేశ్ దేవతలే, స్థానిక అంగ న్‌వాడీ టీచర్లు, ఆయాలు, పోషకులు, చిన్నారులున్నారు.


