రుణాలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

కై లాస్‌నగర్‌: బ్యాంకుల ద్వారా స్వయం సహాయక సంఘాలకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనూష సూచించారు. మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పట్టణంలోని మహిళా సంఘాలకు మంజూరైన బ్యాంకు రుణాల చెక్కులను అందజేశారు. 2026–27ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజీ ద్వారా 453 గ్రూపులకు రూ.51.21 కోట్ల లక్ష్యాన్ని కేటా యించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సీవీఎన్‌ రాజు, డీఎంసీ శ్రీని వాస్‌ , తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ అప్పారావు, ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌, టీఎంసీ భాగ్యలక్ష్మి, మెప్మా, బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement