రైతులను పట్టించుకోని ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతులను పట్టించుకోని ప్రభుత్వం

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

● ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌

బోథ్‌: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను వి క్రయించుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. బో థ్‌ మార్కెట్‌ యార్డును శుక్రవారం సందర్శించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళా రైతు, తాను యార్డుకు తీసుకువచ్చిన పంటను అధికారులు తీసుకోవడం లేదని పేర్కొంటూ కన్నీటి పర్యంతమైంది. స్పందించిన ఆయన వెంటనే అధికారులతో మాట్లాడారు. పంటను తూకం వేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో రమేశ్‌, స్వామి, శ్రీనివాస్‌, శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

నేరడిగొండ: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలోని జొన్న, మొక్కజొన్న కొనుగోలు జి న్నింగ్‌లను సందర్శించారు. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని ఆందోళనలో ఉన్న రైతులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. జిన్నింగ్‌ యాజమాన్యంతో మాట్లాడి వెంటనే 10 లారీలు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చిత్రు, ఎంపీడీవో రమేష్‌, సీఈఓ స్వామి, సర్పంచ్‌ నీలిమ రవీందర్‌ తదితరులు పా ల్గొన్నారు. అనంతరం మండలంలోని కుమారి గ్రా మంలో గల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

వీవోఏల డిమాండ్లు నెరవేర్చకుంటే అసెంబ్లీ ముట్టడి

కై లాస్‌నగర్‌: వీవోఏల డిమాండ్లను ప్రభుత్వం జూన్‌లోగా పరిష్కరించకుంటే వారితో కలిసి అసెంబ్లీ ముట్టడిస్తామని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకు ఉద్యోగ భద్రతన క ల్పించాలని డిమాండ్‌ చేస్తూ వీవోఏలు చేపట్టిన స మ్మె శుక్రవారంతో 13వ రోజుకు చేరుకుంది. కలెక్టరేట్‌ ఎదుట గల సమ్మె శిబిరాన్ని మాజీ మంత్రి జో గు రామన్నతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మంత్రి సీతక్క నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీవోఏలకు రూ. 26వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వీవోఏల జేఏసీ జిల్లా అధ్యక్షుడు తాజాద్దీన్‌, గౌరవాధ్యక్షులు లక్ష్మణాచారి, ప్రధాన కార్యదర్శి అరుణ, కోశాధికారి పవార్‌ శ్యామ్‌ రావ్‌, నాయకులు స్వామి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement