ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలి

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాల ని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. క్యాంపులో పాల్గొన్న 350 మంది చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఐదు చోట్ల శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో మొత్తం 600 మందికి శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు మౌనిక, సురేందర్‌రావు, ఏఎస్పీ రుత్విక్‌ సాయి కొట్టే, శిక్షణ ఐపీఎస్‌ రాహుల్‌ కాంత్‌, డీఎస్పీలు ఎల్‌.జీవన్‌రెడ్డి, ఇంద్రవర్ధన్‌, సీఐలు వెంకటి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement