కైలాస్‌నగర్: ప్రత్యేక ఓటరు సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్)–2026 ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్ –2026 ప్రక్రియ నిర్వహణ పై సంబంధిత అధికారులకు పూర్తి అవగాహనతో కూడిన శిక్షణ అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రాజ ర్షి షా సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ, ఎన్ని కల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ తదితరులు పాల్గొన్నారు.


