ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి అధిక బడ్జెట్ కేటాయించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అర్క నగేశ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో విద్యా పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 5న చలో హైదరాబాద్ కార్యక్ర మం ద్వారా విద్యారంగానికి సంబంధించి ప్ర భుత్వ వైఖరిపై నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించాలని అన్నారు. అలాగే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు ఆపి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు నిలిపివేసి, డీఈవో, ఎంఈ, ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి దిలీప్, గౌరవాధ్యక్షుడు నారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు సేవా సింగ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.


