ఉపాధి కూలీలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలకు అండగా ఉంటాం

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

జైనథ్‌: మండల కేంద్రంలో పని చేస్తున్న ఉపాధిహామీ కూలీల పనిస్థలాలను గురువారం ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. కూలీలతో మాట్లా డి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీ లకు మజ్జిగ పాకెట్లు పంపిణీ చేశారు. అనంత రం ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీలు ఆర్టీసీ బస్సులను మధ్యలో ఎక్కడ ఆపినా ఆపాలని ఆర్టీసీ డీఎంకు ఫోన్‌ చేసి సూచించారు. ఆయన వెంట జైనథ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అల్లూరి అశోక్‌ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ రుకేష్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ బండారి సతీష్‌, కొండ గంగాధర్‌, గడ్డం జగదీశ్‌, రామ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement