భీం జన్మభూమికి నేడు గవర్నర్‌ రాక | - | Sakshi
Sakshi News home page

భీం జన్మభూమికి నేడు గవర్నర్‌ రాక

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

● రౌటసంకెపల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

ఆసిఫాబాద్‌: గోండు బెబ్బులి, ఆదివాసీ పోరాట యోధుడు కుమురంభీం జన్మస్థలమైన ఆసిఫాబాద్‌ మండలం రౌటసంకెపల్లికి శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా రానున్నారు. గ్రామాన్ని హైదరా బాద్‌కు చెందిన నాగేంద్ర దత్తత తీసుకున్న విష యం తెలిసిందే.. భీం స్ఫూర్తి గ్రామోత్సవం–2026 పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా హాజరై పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. కుమురంభీంతోపాటు ఎడ్లకొండు 20 అడుగుల కాంస్య విగ్రహాల ఏర్పాటుకు గవర్నర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆదివాసీలు పెద్దఎత్తున రావాల ని నిర్వహణ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

పర్యటన ఇలా..

రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా శుక్రవారం ఉద యం హెలిక్యాప్టర్‌ ద్వారా బేగంపేట విమానా శ్రయం నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆసిఫాబాద్‌లోని కలెక్టరేట్‌కు చేరుకుంటారు. 11 గంటల నుంచి 12.30 గంటల వరకు అధికారులతో స మీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రౌటసంకెపల్లికి బయలుదేరుతారు. అక్కడ కుమురంభీం స్ఫూర్తి గ్రామోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5.25 గంట లకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారని కలెక్టర్‌ కె.హరి త తెలిపారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ము గ్గురు సీఐలు, 19 మంది ఎస్సైలు, 27 మంది ఏఎ స్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 130 మంది కానిస్టేబుళ్లు, 34 మంది టీజీఎస్పీ సిబ్బంది, 40 మంది స్పెషల్‌ పార్టీ సిబ్బంది, 47 మంది హోంగార్డులు.. మొత్తం 300 మందితో బందోబస్తు నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement