ప్రశాంతంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీ ప్రక్రియ

May 28 2026 1:40 AM | Updated on May 28 2026 1:40 AM

● జిల్లాలో 148 మందికి స్థానచలనం

● జిల్లాలో 148 మందికి స్థానచలనం

కై లాస్‌నగర్‌: పంచాయతీ కార్యదర్శుల బదిలీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. బదిలీ కోసం దరఖాస్తులు అందజేసిన సమయంలో కార్యదర్శులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా అధికారులు కౌన్సెలింగ్‌ చేపట్టారు. ఖాళీలను ప్రొజెక్టర్‌పై ప్రదర్శిస్తూ కార్యదర్శులు ఎంచుకున్న చోటికి బదిలీ చేశారు. జిల్లావ్యాప్తంగా 148 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శులు ఇద్దరు ఉండగా, గ్రేడ్‌–2లో ముగ్గురు, గ్రేడ్‌–3లో ఏడుగురు, గ్రేడ్‌–4లో 136 మంది ఉన్నారు. వీరికి పోస్టింగ్‌ కల్పిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇందులో జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్‌, డీఎల్‌పీవో ఫణిందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement