జిల్లాలో ఇప్పటికే 19 బడుల్లో.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు ఆటపాటలతో అందనున్న విద్యాబోధన నిరుద్యోగ యువతకు ఉపాధి
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండేళ్ల నుంచి సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ ఏర్పాటు చేసి చిన్నారులకు ఆటపాటలతో విద్యనందిస్తోంది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రారంభంతో ఆయా ప్రాథమిక పా ఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మొద టి రెండు విడతల్లో సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ ఏడాది మరిన్ని పాఠశాలల్లో అందుబాటులో తీసుకువచ్చింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు. మండలాల వారీగా పాఠశాలలను ఎంపిక చేశారు.
సర్కారు బడుల బలోపేతం కోసం..
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ప్రీప్రైమరీలను ఏర్పాటు చేసింది. ఆరేళ్ల లోపు చిన్నారులకు ఆటపాటలతో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నారు. అనంతరం నేరుగా ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు సైతం ఆసక్తి చూపుతున్నారు.
ఎంపికై న పాఠశాలలు ఇవే..
జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం నాలుగు ప్రీప్రైమరీలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయగా, 2025–26లో 15, తాజాగా 2026–27గాను 74 పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో ఆదిలాబాద్‌రూరల్ మండలంలో ఐదు పాఠశాలలు ఎంపిక కాగా, వాటిలో అంకోలి, చాందా, భీంసరి, జందాపూర్, పిప్పల్‌ధరి ఉన్నాయి. ఆదిలాబాద్‌అర్బన్‌లో ఐదింటిని ఎంపిక చేయగా, హమీద్‌పూర, సరస్వతినగర్, కేబీ కాలనీ, హెచ్‌బీ కాలనీ, దుర్గానగర్ పాఠశాలలున్నాయి. బజార్‌హత్నూర్‌లో భూతాయి, సర్పంచ్‌గూడ, టెంబి ఉండగా.. బేలలో సాంగిడి, భాది, సిర్సన్న, అవాల్‌పూర్ ఉన్నాయి. భీంపూర్‌లో అర్లి(టి), కరంజి(టి), గోమోత్రి ఉండగా.. బోథ్‌లో బోథ్ బాలికల పాఠశాల(బి), ధన్నూర్(బి), మర్లపల్లి, బోథ్(బి), కుచులాపూర్ ఉన్నాయి. ఇక భోరజ్‌లో గిమ్మ(కె), పిప్పర్‌వాడ, గాదిగూడలో లోకారి(బి), గుడిహత్నూర్‌లో కొల్హారి, మన్నూర్ ఎస్సీకాలనీ, సీతాగోంది, గుడిహత్నూర్ ఉర్దూ మీడియం, ఇచ్చోడలో కేశవపట్నం ఉర్దూ మీడియం, ఇచ్చోడ ఉర్దూ మీడియం, ముఖ్ర(బి), బోరెగాం, ముఖ్ర(కె), ఇంద్రవెల్లిలో ఎస్సీ కాలనీ ఇంద్రవెల్లి, ఇంద్రవెల్లి(బి), ధనోర (బి), ఏమైకుంట, అందునాయక్‌తండా పాఠశాలలున్నాయి. జైనథ్‌లో జైనథ్, కరంజి(కె), కౌట, నిరాల తెలుగు మీడియం, మావలలో మావల–1, బట్టిసావర్గాం, దాజీనగర్, నార్నూర్‌లో నార్నూర్, తడిహత్నూర్, నార్నూర్ ఉర్దూ మీడియం, నార్నూర్ ఎస్సీ, నేరడిగొండలో వడూర్, బుగ్గారం(బి), నేరడిగొండ, తర్నం(కె), సాత్నాలలో సైద్‌పూర్, కామా యి, జామ్ని, సిరికొండలో సిరికొండ ఉర్దూ మీడి యం, సోన్‌పల్లి, రిమ్మ, రాంపూర్(బి), సొనాలలో సొనాల, బంజారతండా, సూర్యనగర్ పాఠశాలలున్నాయి. అలాగే తలమడుగులో కుచులాపూర్, తలమడుగు, రుయ్యాడి, ఉండం, పల్లి(బి), తాంసిలో కప్పర్ల, తాంసి(బి) పాఠశాలలున్నాయి.
జిల్లాలో
డీఈవో పరిధిలో పాఠశాలలు 739
ప్రాథమిక 500
ప్రాథమికోన్నత 119
ఉన్నత 120
మొత్తం విద్యార్థులు 57,896 మంది
త్వరలోనే ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
జిల్లాలో ప్రస్తుతం 19 పాఠశాలల్లో ప్రీప్రైమరీ బోధన సాగుతోంది. ఉన్నత అధికారులు వచ్చే విద్యా సంవత్సరానికి మరో 74 పాఠశాలలను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఇన్‌స్ట్రక్టర్లను నియమించడం జరుగుతుంది.
– లక్ష్మణ్, ఏఎంవో, ఆదిలాబాద్


