‘అంగన్‌వాడీ’ల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

‘అంగన్‌వాడీ’ల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

May 28 2026 1:40 AM | Updated on May 28 2026 1:40 AM

● పక్షం రోజుల్లో నోటిఫికేషన్‌ ● జిల్లాలో 175 టీచర్‌, 574 ఆయా పోస్టుల ఖాళీలు ● నిరుద్యోగుల్లో ఆశలు

ఆదిలాబాద్‌టౌన్‌: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొన్నేళ్లుగా సిబ్బంది కొరతతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 175 అంగన్‌వాడీ, 574 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పక్షం రోజు ల్లోగా నోటిఫికేషన్‌ విడుదల చేసి వీటిని భర్తీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఎదురుచూస్తున్న నిరుద్యోగులు

అంగన్‌వాడీ పోస్టుల కోసం నిరుద్యోగ మహిళా అభ్యర్థులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆయా పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగుల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోస్టర్‌, మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే నోటిఫికేషన్‌..

ఈ పోస్టులకు సంబంధించి 10 నుంచి 15 రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లుగా ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1,288 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 175 టీచర్లు, 574 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టులకు సంబంధించి విద్యార్హత ఇంటర్మీడియెట్‌. నియామకానికి సంబంధించి కలెక్టర్‌ కమిటీ చైర్మన్‌గా, జిల్లా సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, ఆర్డీవో, సీడీపీవోలు సభ్యులుగా ఉంటారు. వీరి ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ చేపడుతారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చి న్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. చిన్నారులకు పోషకాహారంతో పాటు విద్యాబోధన చేపట్టా ల్సి ఉంది. చాలా కేంద్రాల్లో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయాలే వీటి నిర్వహణ చేపడుతున్నారు. విద్యాబోధన పూర్తిస్థాయిలో జరగకపోగా, కేంద్రాలకు వచ్చే చిన్నారులకు భోజనం పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. భారీగా ఆయా పోస్టులు ఖాళీ గా ఉండడంతో అన్ని పనులు టీచర్లే చూసుకుంటున్నారు. ఈ పోస్టులు భర్తీ చేస్తే లబ్ధిదారులతో పాటు నిరుద్యోగులకు మేలు చేకూరనుంది.

ప్రాజెక్ట్‌ టీచర్‌ పోస్టుల ఆయా పోస్టుల ఖాళీలు ఖాళీలు

ఆదిలాబాద్‌అర్బన్‌ 39 96

బోథ్‌ 34 113

జైనథ్‌ 26 104

నార్నూర్‌ 31 90

ఉట్నూర్‌ 45 171

మొత్తం 175 574

జిల్లాలో

ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు : 5

మొత్తం కేంద్రాలు : 1,288

3 నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు : 48,368

గర్భిణులు : 6,056

బాలింతలు : 5,355

మొత్తం లబ్ధిదారులు : 56,779

ఆదేశాలు అందాయి..

అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. పక్షం రోజుల్లోపు నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. 175 టీచర్‌ పోస్టులు, 574 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఖాళీలున్నాయి. వాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా చర్యలు చేపడుతున్నాం.

– మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement