breaking news
at ravulapalem
-
పోలీస్ దిగ్బంధంలో రావులపాలెం
భారీగా బలగాల మోహరింపు రాపిడ్ యాక్ష¯ŒS ఫోర్స్ కవాతు ∙ ముద్రగడ యాత్ర డ్రో¯ŒS కెమెరాలతో నిఘా రావులపాలెం : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపు సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో రావులపాలెం పోలీస్ దిగ్బంధంలో చిక్కుకుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ముద్రగడ స్థానిక కళావెంకట్రావు సెంటరులో ఈ పాదయాత్ర ప్రారంభించనుడడంతో పోలీస్ ఉన్నతాధికారులు రావులపాలెంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విజయకుమార్, అడిషనల్ ఎస్పీలు ఏఆర్ దామోదర్, శ్రీనివాసరావు, శివారెడ్డి, ఐదుగురు డీఎస్పీలు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఒక్క రావులపాలెంలోనే సుమారు వెయ్యి మంది పోలీసులతోపాటు ఏపీఎస్పీ, రాపిడ్యాక్ష¯ŒS ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు రావులపాలెంలో మోహరించారు. రాపిడ్ యాక్ష¯ŒS ఫోర్స్ కవాతు రావులపాలెం చేరుకున్న రాపిడ్ యాక్ష¯ŒS ఫోర్స్ స్థానిక కళావెంకట్రావు సెంటరు నుంచి అరటి మార్కెట్ యార్డు వరకూ అక్కడ నుంచి తిరిగి కళావెంకట్రావు సెంటరు వరకూ రింగ్‌రోడ్డు, మార్కెట్ రోడ్డు మీదుగా పోలీస్‌స్టేçÙ¯ŒS వరకూ కవాతు నిర్వహించింది. ఏపీ పీకే రావత్ సారధ్యంలో ఫోర్స్ కవాతు చేశారు. డ్రోన్లతో పర్యవేక్షణ ముద్రగడ యాత్ర సమయంలో అణుఅణువు పరిశీలించేందుకు అధిక సంఖ్యలో డ్రో¯ŒS కెమెరాలను సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం వీటిని ప్రయోగాత్మకంగా కళావెంకట్రావు సెంటరులో పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్, కృష్ణా జిల్లా ఎస్పీ విజయకుమార్ పర్యవేక్షణలో ఐదు డ్రో¯ŒS కెమెరాలను నాలుగు వైపుల నుంచి ప్రయోగించారు. దివిలిలో ఉత్కంఠ పెద్దాపురం : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యగ్రహ యాత్ర చేపటనున్న నేపథ్యంలో పెద్దాపురం మండలం దివిలిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కిర్లంపూడి నుంచి కోనసీమకు దివిలి మీదుగా వెళ్లనుండడంతో పోలీస్ యంత్రాంగం దివిలి జంక్ష¯ŒSలో అప్రమత్తమైంది. ప్రత్తిపాడు నుంచి సామర్లకోట వైపునకు వెళ్ళే కాపు నేతల కార్లు, వాహనాలు మంగళవారం ఉదయం అడ్డుకోవడంతో ఒకానొక సమయంలో ఉత్కంఠ పరిస్థితులు ఎదురయ్యాయి. వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజవకర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు కిర్లంపూడి నుంచి కాండ్రకోట వెళ్లుతుండగా తిరుపతి రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి కూడా ఇలానే అడ్డుకుంటే వివరంగా చెప్పినా మళ్ళీ వాహనాన్ని ఆపడం సమంజసం కాదని చెప్పినప్పటికీ ఎక్కడికీ వెళ్ళుతున్నారో చెప్పాలంటూ పోలీసులు అనడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. కాపు ఉద్యమంపై ఇంత అక్కసు పని చేయదని, కనీసం సొంత పనులకు కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం దారుణమని సుబ్బారావు నాయుడు అన్నారు. ఖాకీ రాజ్యంగా చంద్రబాబు పాలన : జక్కంపూడి విజయలక్ష్మి తాడితోట (రాజమహేంద్రవరం) : చంద్రబాబు పాలన కాకీ రాజ్యంగా మారిందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాద యాత్ర సందర్భంగా రాజమహేంద్రవరంలో గృహ నిర్బంధంలో ఉన్న జక్కంపూడి విజయలక్ష్మి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గృహ నిర్బంధం చేసి నాయకులను భయపెట్టలేరని, సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటున్న వారిపై పోలీసులను అడ్డుపెట్టుకొని అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు తప్పించుకుంటున్నారన్నారు. ముద్రగడ యాత్రను ఆపేందుకు ప్రభుత్వం యుద్ధ వాతావరణం సృష్టిస్తోందని అన్నారు. కాపు నేతల అరెస్టులు అన్యాయం : కురసాల కన్నబాబు సాక్షిప్రతినిధి, కాకినాడ : అసలు రాష్ట్రంలో పాలన సాగిస్తోంది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేదా అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాపు ఉద్యమం, దివీస్ కాలుష్య కర్మాగారం భూ సేకరణ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సెక్ష¯ŒS 30, 144 సెక్ష¯ŒSలు అమలు చేస్తూ చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. ముద్రగడ సహా పలువురు కాపు జేఏసీ నేతలు పోలీసులు గృహనిర్బంధించడంపై మంగళవారం రాత్రి కన్నబాబు స్పందిస్తూ ప్రభుత్వ చర్యను ఖండించారు. కోనసీమలో అన్ని పోలీసు బలగాలను మోహరింప చేయడంలో ప్రభుత్వ ఉద్ధేశం ఏమిటో అర్థంకావడం లేదన్నారు. గద్దెనెక్కేందుకు చంద్రబాబు ఎన్నికల్లో వెనుకాముందూ చూసుకోకుండా హామీలు ఇచ్చేసి ఇప్పుడు కాపులు రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులతో ఉక్కుపాదం మోపడం అన్యాయమన్నారు. కాపులను అరాచశక్తులుగా ముద్రవేసి మిగిలిన వర్గాలకు దూరంచేసే కుట్రతోనే చంద్రబాబు ఇటువంటి దగాకోరు విధానాలకు పాల్పడుతున్నారని కన్నబాబు విమర్శించారు. -
జాతీయ రహదారిపై వ్యాన్ దగ్ధం
సురక్షితంగా బయటపడిన డ్రైవర్ రావులపాలెం: జాతీయ రహదారిపై వెళుతున్న వ్యాన్‌లో గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించి క్షణాల్లో కారు కాలి పోయింది. నరేంద్రపురానికి చెందిన డ్రైవర్ నక్కా శరత్‌బాబు మారుతి వ్యాన్‌లో రావులపాలెం వైపు నుంచి తణుకు వైపు వెళుతున్నాడు. స్థానిక వీస్కే్వర్ థియేటర్ సమీపంలోకి వచ్చేసరికి కారులో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ శరత్‌బాబు కారు నుంచి బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. క్షణాల్లో మంటలు వ్యాపించి వ్యాన్ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఇరువైపులా సుమారు అరకిలోమీటరు దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఐ పీవీ రమణ అక్కడకు చేరుకుని కొత్తపేట అగ్నిమాపక అధికారికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోగా సీఐ స్థానికుల సాయంతో ఫోమ్ ఉపయోగించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ వై.శ్రీరాములు అగ్నిమాపక సిబ్బందితో అక్కడకు చేరుకొని మంటలు అదుపు చేశారు. ఆ వ్యాన్‌లో రెండు గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను పోలీసులు గుర్తించారు. హైవే రెండో లైన్‌పై ట్రాఫిక్‌ను మళ్లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తెలిపారు.