రేషన్‌ దుకాణాలపై సామాజిక తనిఖీ

Social inspection on ration shops - Sakshi

తాజా మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ దుకాణాల్లో వినియోగదారులకు అందుతున్న సేవలపై సామాజిక తనిఖీ చేసేలా తాజా మార్గదర్శకాలు జారీచేస్తూ పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతీ ఆరు నెలలకోసారి గ్రామసభ పెట్టి రేషన్‌ దుకాణాల రికార్డులు, సరుకుల పంపిణీ తదితర అంశాలపై సామాజిక తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు.

తాజా మార్గదర్శకాల ప్రకారం..అర్బన్‌ ఏరియాలో గత ఆరు నెలల డాక్యుమెంట్లను సభల్లో ప్రవేశపెట్టాలి. గ్రామసభ ఎక్కడ పెట్టేది, ఏ తేదీన నిర్వహించేది తదితర వివరాలను వీఆర్వో విజిలెన్స్‌ కమిటీకి తెలియపరచాలి. ఆ గ్రామంతో పాటు, శివారు గ్రామ వినియోగదారులకూ తనిఖీ విషయం తెలిసేలా ప్రచారం చేయాలి. ఉదయం 8–10 మధ్య లేదా సాయంత్రం 4–6 గంటల మధ్య సామాజిక తనిఖీ జరిగేలా చూడాలి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top