కాలేజీకని వెళ్లి.. విద్యార్థిని అదృశ్యం | Degree Student missing | Sakshi
Sakshi News home page

కాలేజీకని వెళ్లి.. విద్యార్థిని అదృశ్యం

Jun 19 2015 5:17 PM | Updated on Sep 4 2018 5:16 PM

కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది.

నాగోలు (హైదరాబాద్) : కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. ఎల్‌బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.... ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన గుంజి కల్పన(21) కొత్తపేటలోని శివాని కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. అయితే గురువారం ఉదయం కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు చుట్టు పక్కల వారిని, తెలిసిన వారిని అడిగారు, పలుచోట్ల వెదికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో తల్లి ఈశ్వరమ్మ శుక్రవారం ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement