మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అజాద్......
ఆదిలాబాద్ క్రైం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండేల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులను విచారించాలని ఆజాద్ భార్య పద్మ వేసిన ప్రొటెక్టు పిటిషన్‌ను ఆదిలాబాద్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు (ప్రథమ శ్రేణి న్యాయమస్థానం) తిరస్కరించింది. మంగళవారం పద్మ, ఆమె తరపు న్యాయవాది సురేష్‌కుమార్‌లు ఆజాద్ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యారు. ఆజాద్‌ది బూటకపు ఎన్‌కౌంటర్ అని, ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులపై విచారణ చేపట్టాలని పద్మ 2013 జూలై 2న కోర్టులో ప్రొటెక్ట్ పిటిషన్‌ను వేశారు. రెండేళ్ల అనంతరం పోలీసులను విచారించడం వీలుకాదంటూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.