ఆదిలాబాద్‌ డీఎస్పీ, జైనథ్‌ ఎస్‌ఐపై వేటు | Adilabad DSP And Sub Inspector Suspended | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ డీఎస్పీ, జైనథ్‌ ఎస్‌ఐపై వేటు

Jun 9 2019 7:25 AM | Updated on Jun 9 2019 7:25 AM

Adilabad DSP And Sub Inspector Suspended - Sakshi

నర్సింహారెడ్డి, ఎస్‌ఐ తోట తిరుపతి

ఆదిలాబాద్‌ రూరల్‌: ఫోర్‌స్క్వేర్‌ టెక్నో మార్కె టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటుపడింది. కేసు దర్యాప్తు,. నిందితుల అరెస్టులో అలసత్వం ప్రదర్శించడంతో ఆదిలాబాద్‌ డీఎస్పీ కె.నర్సింహారెడ్డి, జైనథ్‌ ఎస్‌ఐ తోట తిరుపతిలను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నాగారం కల్యాణ్‌కుమార్‌ ఫోర్‌ స్క్వేర్‌ టెక్నో మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నకిలీ సంస్థను స్థాపించాడు. నిరుద్యోగులకు డిజిటల్‌ ఇండియా పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికాడు.

596 మంది నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల చొప్పున సుమారు రూ.3.57 కోట్లు ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేశాడు. ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ నర్సింహారెడ్డి, అప్పటి ఆదిలాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ తోట తిరుపతి సోదాలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అక్రమాలకు పాల్పడి నిందితులను కాపా డేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ఎస్పీ వారిద్దరిపై డీజీపీకి నివేదిక పంపగా.. ఇద్దరిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement