6 గంటలు.. రూ.63 వేలు


భైంసా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఆదేశాల మేరకు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు కేంద్రాలపై ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ నేతృత్వంలో తనిఖీలు కొనసాగించారు. 61వ జాతీయ రహదారిపై భైంసా-బాసర, భైంసా -నాందేడ్ కూడలి వద్ద భైంసా పట్టణ సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు కేంద్రంలో ఆదిలాబాద్ ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వేణుగోపాల్, కరీంనగర్ ఇన్‌స్పెక్టర్ వీరభద్రం, రమణమూర్తి, కాశయ్య, ఇతర సిబ్బంది ఆకస్మి క తనిఖీలు చేపట్టారు. మంగళవారం వేకువజామున 2.30 గంటల ప్రాంతంలో వచ్చిన తనిఖీ బృందం ఆర్టీవో, ఏసీటీవో కేంద్రాల్లో తనిఖీలు చేపట్టింది. వి ధుల్లో ఉన్న సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. కంప్యూటర్లు, రికార్డులను పరిశీలించారు.సిబ్బందిని తప్పించి..

తనిఖీలకు వచ్చిన ఏసీబీ అధికారుల బృందం రెండు చెక్‌పోస్టుల్లో విధుల్లో ఉన్న సిబ్బందిని తప్పించి వారి స్థానంలో కూర్చొని  కార్యకలాపాలను కొనసాగించా రు. 61వ జాతీయ రహదారిపై తెలంగాణ నుంచి మహారాష్ట్రకు, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే భారీ వాహనాలు, లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లు తీసుకువచ్చే మాముళ్లు అనుమతిపత్రాలను పరిశీలించారు. ఎప్పటిలాగే లారీ డ్రైవర్లు సంబంధిత పత్రాలతోపాటు ‘మాముళ్లు’గా ఇచ్చే డబ్బులను చేతిలో పట్టుకొచ్చారు. సిబ్బంది స్థానంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఏసీబీ అధికారులకు అప్పజెప్పి ఎప్పటిలాగే వెనుదిరిగారు.ఏసీబీ అధికారులు డబ్బులు ఇచ్చిన డ్రైవర్ల నుంచి ఎంత నగదు ఇస్తున్నారో అనే వివరాలను లిఖిత పూర్వకంగా రాయించుకున్నారు. రోజూలాగే డబ్బులు ఇస్తున్నట్లు లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఏసీబీ అధికారులకు వెల్లడించారు. సంబంధిత వివరాలన్నింటినీ ఏసీబీ అధికారులు రికార్డు చే శారు. లారీల డ్రైవర్లు ఏసీటీవో చెక్‌పోస్టులో నేరుగా డబ్బులతో వచ్చి ఏసీబీ అధికారులకే మాముళ్లు ఇస్తూ పోయారు. తదుపరి ఎంవీఐ మోహన్‌గౌడ్, ఏసీటీవో చెక్‌పోస్టులో ఇన్‌చార్జి అధికారి కొండారెడ్డి నుంచి వివరాలు సేకరించారు.ముందస్తు సమాచారం ఉందా..?

ఏసీబీ తనిఖీలు చేపడుతున్నట్లు చెక్‌పోస్టుల్లో ముంద స్తు సమాచారం ఉందా అనే విషయంపై అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం వేకువజామున 2.30 గంటల నుంచి ఉదయం 8.30 వరకు తనిఖీలు కొనసాగాయి. సిబ్బంది స్థానంలో ఏసీబీ అధికారులు వసూళ్లు కొనసాగించారు. అయితే.. ఆ రు గంటల్లోనే రెండు చెక్‌పోస్టుల్లో సుమారు రూ.63 వేలు అక్రమంగా కట్టిన మామూళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులే వివరిస్తున్నారు. అలాగైతే రాత్రి 2.30 గంటల వరకు ఈ చెక్‌పోస్టుల్లో అక్రమం గా వసూలు చేసిన మాముళ్ల లెక్క ఎంత ఉంటుందో ఆ మొత్తాన్ని ఏ ప్రైవేటు వ్యక్తుల వద్ద దాచి ఉంచారో అనే విషయంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. భైంసా చెక్‌పోస్టులో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఈ విషయంపైనా లోతైన దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కిస్తీల్లో కోడిగుడ్లు..

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు కేంద్రంలో సిబ్బంది కోసం ఏ ర్పాటు చేసిన కౌంటర్‌లో కోడిగుడ్ల కిస్తీలు కనిపించా యి. చెక్‌పోస్టుగుండా వెళ్లే వాహనాల నుంచి అక్కడి సిబ్బంది కోడిగుడ్లను కూడా వదలకుండా అక్రమం గా తీసుకుని ఇంటికి తీసుకెళ్లేందుకు భద్రపరిచారు.స్వాధీనం చేసుకున్నాం

భైంసా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహిం చాం. వాహన డ్రైవర్లు చెక్‌పోస్టు వద్ద అక్రమంగా కట్టి న మాముళ్లు స్వాధీనం చేసుకున్నాం. ఆర్టీవో చెక్‌పోస్టులో రూ.52 వేలు, ఏసీటీఓ చెక్‌పోస్టులో రూ. 4,380 స్వాధీనం చేసుకున్నాం. డ్రైవర్ల నుంచి వివరా లు సేకరించాం. ఈ విషయంపై ప్రభుత్వంతోపాటు ఆయాశాఖల ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. ఎక్కడ అక్రమాలు జరిగినా ఏసీబీ అధికారులకు సంప్రదించాలి.  - సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top