రిజిస్ట్రేషన్లు రయ్ రయ్! | Lands Registrations has increased over new districts formation | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్లు రయ్ రయ్!

Oct 7 2016 3:02 AM | Updated on Sep 4 2017 4:25 PM

రాష్ట్రవ్యాప్తంగా గత ఆర్నెల్లలో భూముల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి.

కొత్త జిల్లాల నేపథ్యంలో పెరిగిన క్రయ విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గత ఆర్నెల్లలో భూముల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భారీగా భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. మొత్తంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గత ఆరు నెలల్లో దాదాపుగా రూ.2 వేల కోట్లకు చేరువైంది. గతేడాది ఇదే సమయానికన్నా ఇది 31.21 శాతం ఎక్కువ కావడం గమనార్హం. మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధికంగా 30 నుంచి 48 శాతం దాకా ఆదాయం పెరగగా... మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు పెరుగుదల కనిపించింది.
 
 ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా తగ్గిపోవడం విశేషం. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రూ.వందల కోట్లలో ఆదాయం పెరిగింది. ప్రభుత్వం గత  నాలుగేళ్లుగా భూముల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచకున్నా.. ఏటా ఆదాయం గణనీయంగా పెరుగుతుండడం పట్ల రిజిస్ట్రేషన్ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ఇదే తరహా పెరుగుదల కొనసాగితే ఈ ఏడాది వార్షిక (రూ.4,292 కోట్లు) లక్ష్యాన్ని సులువుగానే చేరుకోగలమని ఉన్నతాధికారులు చె బుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement